నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు | Srivari Salakatla Vasanthotsavam celebrations from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

Mar 30 2026 3:55 AM | Updated on Mar 30 2026 3:55 AM

Srivari Salakatla Vasanthotsavam celebrations from today

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి ఏప్రిల్‌ 1 వరకు మూడు రోజుల­పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. సోమ­వారం ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి నాలుగు మాడవీధులలో ఊరేగనున్నారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. వసంతోత్సవ అభిషేక నివేదనల అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. 

31న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవం నిర్వ­హిస్తారు.  1న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప­స్వామివారితో పాటు శ్రీ సీతా­రామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్స­వర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. 

ఈ సందర్భంగా రోజూ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. అలాగే రోజూ సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం ఉంటుంది. ఈ సందర్భంగా మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర­దీపాలంకార సేవలను, మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement