ఏపీ: ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా ఓకే.. వీఆర్‌ఎస్‌పై సోమేశ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు

Somesh Kumar To Meet AP CS Jawahar Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను ఏపీ కేడర్‌కు కేటాయించినందు వల్ల అక్కడే విధులు నిర్వహించాలని కోర్టు పేర్కొంటూ తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది. 

ఈ క్రమంలో మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఏపీలో రిపోర్ట్‌ చేయనున్నారు. దీనిలో భాగంగా గురువారం ఉదయం విజయవాడకు చేరుకున్న సోమేష్‌ కుమార్‌.. ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిశారు. విజయవాడలో సోమేశ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీకి వచ్చాను. నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తాను. ఒక అధికారిగా డీవోపీటీ ఆదేశాలు పాటిస్తున్నాను. ఏపీ సీఎస్‌ జవహర్‌ రెడ్డిని కలిసి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయడానికి వచ్చాను. వీఆర్‌ఎస్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కుటుంబ సభ్యులతో చర్చించాక చెబుతాను’ అని స్పష్టం చేశారు.  ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యారు సోమేష్‌ కుమార్‌.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top