అమ్మా ఎందుకు వదిలేశావ్‌..?

Someone Left Baby Girl On Pile Of Sticks In Kosta Village Srikakulam - Sakshi

రాత్రి 8 గంటల సమయం. చుట్టూ చిమ్మచీకటి. మెల్లగా ముసురుకుంటున్న చలి గాలులు. నిశ్శబ్దమైన వాతావరణంలో వినిపించిన ఓ పసికందు రోదన కోష్ట గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో భద్రంగా ఉన్న బిడ్డ ఆ పేగు తెంచుకున్నాక.. బంధాలకు కూడా దూరమై ఇలా చీకటిలో నిస్సహాయంగా స్థానికుల కంట పడింది. జేఆర్‌పురం ఎస్‌ఐ జి.రాజేష్‌ తెలిపిన వివరాల మేరకు.. కోష్ట గ్రామంలోని ఒక కర్రల మోపుపై ఎవరో ఒక ఆడ పసికందును విడిచిపెట్టి వెళ్లిపోయారు.

స్థానికులు పసిపాప ఏడుపులు విని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్‌ఐ రాజేష్‌ పాపను రణస్థలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ బిడ్డను ఎవరు ఇక్కడ వదిలి వెళ్లిపోయారో తెలియాల్సి ఉంది. పసికందు 1.5 కిలోల బరువు ఉందని, జన్మించి ఒక రోజు అయి ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.    

(చదవండి: సిక్కోలు గుండెల్లో ఆ గురుతులు పదిలం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top