న్యాయాధికారుల పదవీ విరమణ వయసు ఏడాది పెంపు | Retirement age of judicial officers increased by one year | Sakshi
Sakshi News home page

న్యాయాధికారుల పదవీ విరమణ వయసు ఏడాది పెంపు

Oct 4 2026 5:43 AM | Updated on Oct 4 2026 5:43 AM

Retirement age of judicial officers increased by one year

61 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని న్యాయా­ధికారుల (జ్యుడీషియల్‌ ఆఫీ­సర్లు) పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఈ నెల 1న ఆర్డినెన్స్‌ జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని శనివారం గెజిట్‌లో ప్రచురించింది. న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని సుప్రీంకోర్టు ఇటీవల పలు రాష్ట్రాలను ఆదేశించింది. 

మరో­వైపు న్యాయా­ధికారుల పదవీ విరమణ వయసు పెంపు విషయంలో దేశవ్యాప్తంగా ఏకరూప విధానం అమలయ్యేలా చూసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పాటు పలు ఇతర రాష్ట్రాలకు కూడా స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వేర్వేరు ఆదేశాలు ఇచ్చింది. పదవీ విరమణ వయసు పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ హై­కోర్టులను సంప్రదించాలని కూడా ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం న్యాయాధికారుల పదవీ విరమణ వయసును పెంచాలని నిర్ణయిస్తే, ఆ పెంపు నిర్ణయం అమల్లోకి వచ్చే మధ్యంతర కాల­ంలో పదవీ విరమణ చేసిన న్యా­యాధికారులకు కూడా ఆ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని సుప్రీ­ం­కోర్టు వెసులుబాటును ఇచ్చింది. 

ప్రత్యేకంగా సమావేశమైన ఫుల్‌కోర్టు
ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్‌ కోర్టు ఈ ఏడాది ఆగస్టు 24న ప్రత్యేకంగా సమావేశమైంది. రాష్ట్రంలోని అందరు న్యాయాధికారులు పదవీ విరమణ వయసును 61 నుంచి 62కు పెంచాలని సిఫారసు చేసింది. ఈ విషయాన్ని హైకోర్టు లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. అటు సుప్రీంకోర్టు ఆదేశాలు, ఇటు హైకోర్టు ఫుల్‌కోర్టు సిఫారసు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 62కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ ఏడాది మార్చి 31 నుంచి వర్తిస్తుంది. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి ప్రతిభాదేవి శనివారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement