
థంబ్ వేయించుకుని డబ్బు చెల్లించిన రేషన్ డీలర్
తర్లుపాడు: పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న చౌకబియ్యం దళారులు, అధికార కూటమి నేతలకు ఆదాయ వనరుగా మారింది. 1న కార్డుదారులకు అందుబాటులో ఉండి నిత్యావసర వస్తువులు సరఫరా చేయాల్సిన డీలర్ ఇంటింటికీ తిరిగి బయోమెట్రిక్ థంబ్ వేయించుకుని ‘రేషన్ లేదు.. డబ్బులు తీస్కోండి’ అంటూ కార్డుదారులపై మండిపడటం.. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటం ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో తీవ్ర చర్చకు దారితీసింది.
మండలంలోని కేతగుడిపి పంచాయతీలో సుమారు 1100 మంది రేషన్‌కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ 1న రేషన్ అందించాల్సిన డీలర్ తన కుమారుడు ద్వారా బియ్యం లేవంటూ కార్డుదారుల నుంచి థంబ్ వేయించుకుని కిలోకు రూ.10 చొప్పున డబ్బు చెల్లించారు. ఇదేమని అడిగేందుకు సాహసించని కార్డుదారులు ఇచి్చనకాడికి తీసుకొన్నారు. గతంలో రేషన్ బియ్యాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కార్డుదారుల ఇళ్లకు వెళ్లి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం రేషన్ డీలర్లే అధికార పార్టీ నేతల అండతో బియ్యం ఇవ్వకుండా నేరుగా మార్కెట్‌కు తరలిస్తుండటం గమనార్హం.