
నంది అవార్డులు అర్హులకే వస్తాయని.. ఎవరికీ అన్యాయం జరగదని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు.
సాక్షి, హైదరాబాద్: నంది అవార్డులు అర్హులకే వస్తాయని.. ఎవరికీ అన్యాయం జరగదని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అర్హులైన నటులను గుర్తించి గౌరవిస్తామని, నంది అవార్డుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
పారదర్శకంగా అవార్డుల ఎంపిక ఉంటుందన్నారు. సీఎం జగన్ నాపై గొప్ప బాధ్యత పెట్టారు. నంది నాటకోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. అర్హులైన వారికి అవార్డులిచ్చి సత్కరిస్తాం’’ అని పోసాని కృష్ణమురళి వెల్లడించారు.
ఇదీ చదవండి: ఏపీలో నేరాలు తగ్గాయి: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి