
ప్రకాశం: ప్రకాశం జిల్లా కొండేపి మండలం పెదకండ్లగుంటలో పోలీసుల అత్యుత్సాహం చూపించారు. మహర్నవమి సంధర్బంగా హైకోర్ట్ ఉత్తర్వులతో గ్రామంలో కోలాటం ఏర్పాటు చేసుకొన్న వైయస్సార్సీపి కార్యకర్తలు. దానికి పోటీగా రికార్డు డ్యాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసిన తెలుగుదేశం కార్యకర్తలు.
కోలాటం మైకులు లేకుండా అలంకరణ లేకుండా వెయ్యలంటూ పోలీసుల హుకుం జారీ చేశారు. స్టేజీ తొలగించడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులను అడ్డుకొన్న వైయస్సార్సీపి కార్యకర్తలు.
సంప్రదాయ పద్దతిలో చేస్తున్న కోలాటంను అడ్డుకోని రికార్డు డ్యాన్స్ కి పరిమీషన్ ఇవ్వడం పై గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు.