లక్షకు పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించాం | Pension Cancelled To One Lakh Persons With Disabilities In Andhra Pradesh, More Details Inside | Sakshi
Sakshi News home page

లక్షకు పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించాం

Aug 21 2025 6:15 AM | Updated on Aug 21 2025 9:39 AM

Pension cancelled to one lakh persons with disabilities in Andhra Pradesh

తొలగించమని చంద్రబాబుకు నేనే లేఖ రాశా: స్పీకర్‌ అయ్యన్న

నర్సీపట్నం: ఇప్పటి­వర­కు రాష్ట్రంలో లక్షకు పై­గా వికలాంగుల పెన్షన్లు తొలగించామని స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు తెలి­పారు. అనర్హులైన విక­లాంగులకు పింఛన్‌ తొలగించమని సీఎం చంద్రబాబుకు తానే లేఖ రాశానని చెప్పారు. రాష్ట్రంలో 14 నెలల్లో 4.5 లక్షల పెన్షన్లు తొలగించారు. వికలాంగ పెన్షన్లు లక్ష వరకు తొలగించామని సాక్షాత్తు స్పీకరే చెబుతు­న్నారు. రానున్న కాలంలో మరెన్ని పెన్షన్లకు మంగళం పలుకుతారోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్‌ మీడియాతో మాట్లాడుతూ..  అర్హత లేకుండా పెన్షన్‌ పొందుతున్న వికలాంగులు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారన్నారు.

ఈ విషయమై రెండు నెలలు క్రితం తానే స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్టు తెలి­పారు. నిబంధనల ప్రకా­రం 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారిని మాత్రమే అర్హులుగా గు­ర్తించాల్సి ఉందన్నారు. 40 శాతం కంటే తక్కు­వ ఉన్నవారిని అనర్హు­లుగా గుర్తించాలన్నారు. అనకాపల్లి జిల్లాలో  4,148 మంది వికలాంగుల్లో 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారిని గుర్తించార­న్నారు. అందులో 120 మందిని ఆరోగ్య పింఛన్లకు ఎంపిక చేసినట్టు తెలిపారు. 679 మందిని వృద్ధాప్య పింఛన్ల­లోకి మార్చగా.. 3,349 మంది వికలాంగుల పింఛన్లు రద్దు చేసినట్టు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement