దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్

Pedda Reddy Complained About Diwakar Travels Forgery Case In Karnataka Lokayukta - Sakshi

సాక్షి, అనంతపురం : దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై కర్ణాటక లోకాయుక్తను ఆశ్రయించారు. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి ఫోర్జరీలపై లోకాయుక్తకు ఆధారాలు సమర్పించారు. జేసీకి సహకరించిన కర్ణాటక రవాణా శాఖ అధికారుల పాత్రపైనా ఫిర్యాదు చేశారు. ( డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్‌ చేస్తా )

కర్ణాటక డీజీపీ, పలువురు మంత్రులకు వీరిపై ఫిర్యాదు చేశారు. కాగా, 2017లో బీఎస్-3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే దివాకర్‌ ట్రావెల్స్‌ నిషేధిత వాహనాలను నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేయించింది. స్ర్కాప్ కింద కొనుగోలు చేసిన 33 బస్సులు, లారీలను కర్ణాటకలో నడుపుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top