బతికుండగానే... మృతుల జాబితాలోకి..! | Non communicable diseases survey riddled with errors | Sakshi
Sakshi News home page

బతికుండగానే... మృతుల జాబితాలోకి..!

Feb 28 2025 5:26 AM | Updated on Feb 28 2025 5:26 AM

Non communicable diseases survey riddled with errors

ఎన్‌సీడీ సర్వే తప్పుల తడక  

బతికున్న వారిని మృతుల జాబితాలోకి  చేర్చిన వైద్య సిబ్బంది 

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) సర్వే తప్పుల తడకగా జరుగుతోంది. ఈ సర్వే లక్ష్యాన్ని  వైద్య సిబ్బంది నీరుగారుస్తున్నారు. ఇంటింటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చేసేస్తున్నారు. దీంతో సర్వేలో తప్పులు దొర్లుతున్నాయి. బతికున్న వారిని కూడా మృతుల జాబితాలోకి చేర్చారు. చిత్తూరు జిల్లాలో ఈ సర్వే నత్తనడకన జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు కలిసి ఈసర్వే చేయాల్సి ఉంది. 

నాన్‌ కమ్యూనికబుల్‌ డిసిజెస్‌ (ఎన్‌సీడీ) అయిన బీపీ, మధుమేహం, క్యాన్సర్‌ వంటి కేసులను గుర్తించాలి. అయితే వీరంతా ఇంటింటి సర్వేకు వెళ్లకుండా వారి ఇష్టానుసారంగా చేస్తున్నారు. కొంతమందికి ఫోన్‌ చేసి ఓటీపీలతో పని కానిచ్చేస్తున్నారు. ఇక చేసే ఓపికలేని వారు చనిపోయారని, పరి్మనెంట్‌గా మైగ్రేట్, తాత్కాలిక మైగ్రేట్, సీబ్యాక్‌ సర్వే జాబితాలోకి చేరుస్తున్నారు. తాజాగా చిత్తూరులోని సత్యనారాయణపురంలో నివాసముంటున్న కటికపల్లి నారాయణ స్వామి, కటిక పల్లి జ్యోతి బతికుండగానే చనిపోయిన వారి జాబితాలోకి చేరారు. 

ఇలా ఈ దంపతులే కాదు.. చాలా మందిని చనిపోయిన జాబితాలోకి చేర్చడంతో సర్వేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిoది. కాగా గత ప్రభుత్వ హయాంలో వైద్య సేవలతో పాటు సర్వేలన్నీ పకడ్బందీగా జరిగేవనీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వైద్యసేవలతోపాటు సర్వేలు కుంటుపడ్డాయని పలువురు విమర్శిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement