AP Night Curfew Timings Today: Andhra Pradesh Night Curfew Extended - Sakshi
Sakshi News home page

ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

Jul 30 2021 11:00 AM | Updated on Jul 30 2021 3:22 PM

Night Curfew Extended In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి :  ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది. ఆగస్టు 14 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. కాగా, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా వీలైనంత త్వరగా ఉపాధ్యాయులకు టీకా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.

వచ్చే నెలలో పాఠశాలలను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మే, జూన్, జూలై నెలల్లో ప్రైవేటు ఆస్పత్రులకు 43,38,000 డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 మాత్రమే వినియోగించారని, ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగంగా ముందుకు సాగుతుందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement