కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా డాక్టర్ సుధీర్ ప్రమాణం | Nellore Mayor And 12 Municipal Chairman Elections To Be Held In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రెండేసి డిప్యూటీ మేయర్లు,  వైస్‌ చైర్మన్ల ఎన్నికలు కూడా..

Published Mon, Nov 22 2021 2:35 AM | Last Updated on Mon, Nov 22 2021 6:46 PM

Nellore Mayor And 12 Municipal Chairman Elections To Be Held In Andhra Pradesh - Sakshi

కృష్ణా జిల్లా
జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన రంగాపురం రాఘవేంద్ర
జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా 32 ఏళ్ల రాఘవేంద్ర. 
వైస్ చైర్మన్లుగా తుమ్మల ప్రభాకర్, షేక్ హఫీజ్ ఉన్నిస
చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లను అభినందించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను.

పశ్చిమగోదావరి జిల్లా
కొలువుదీరిన ఆకివీడు నగర పాలక  సంస్థ తొలి పాలక వర్గం
తొలి నగర పంచాయతీ చైర్ పర్సన్‌గా జామి హైమావతి ఎన్నిక
వైస్ చైర్మన్లుగా పుప్పాల సత్యనారాయణ, వంగా జ్యోత్స్నాదేవిలను ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులు
ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన జేసీ హిమాన్షు శుక్లా

తూర్పు గోదావరి జిల్లా
ఇవాళ ఏజెన్సీ ఎటపాక ఎంపీపీ ఎన్నిక
టాస్ పద్ధతిలో ఎంపిక నిర్వహించనున్న అధికారులు
మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 6 స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ, టీడీపీ 4, సీపీఎం 1, సీపీఐ ఒకస్థానం గెలుచుకున్నారు.
వైఎస్సార్‌సీపీ, టీడీపీ కూటమికి సమాన స్థానాలు రావడంతో మధ్యాహ్నం మూడు గంటలకు టాస్ పద్ధతిలో ఎంపీపీ ఎంపిక

కృష్ణాజిల్లా
కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక రేపటికి వాయిదా  
కేశినేని నాని కోర్డును మభ్యపెట్టి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు 
కోర్టుకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది 
డివిజన్ బెంచ్ తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం
చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా వేయాలని అధికారులను కోరాం
మా విజ్ఞప్తి మేరకు అధికారులు ఎన్నికను వాయిదా వేశారు -ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

చిత్తూరు
కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ సుధీర్ ప్రమాణ స్వీకారం
వైస్ చైర్మన్‌గా అఫీస్, మునిస్వామిలు ప్రమాణం

సాక్షి, అమరావతి: ఇటీవల ఎన్నికలు జరిగిన నెల్లూరు నగరపాలకసంస్థ, 12 మునిసిపాలిటీలు/నగర పంచాయతీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నిక సోమవారం జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు సమావేశమై మేయరు, ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. అకివీడు (పశ్చిమ గోదావరి జిల్లా), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (వైఎస్సార్‌), పెనుకొండ (అనంతపురం), కుప్పం (చిత్తూరు జిల్లా) మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికైన  సభ్యులు ఎక్కడికక్కడ ఉదయం 11 గంటలకు సమావేశమై చైర్మన్, ఇద్దరు వంతున వైస్‌ చైర్మన్లను ఎన్నుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement