నంద్యాల సీఐ, కానిస్టేబుల్ల బెయిల్‌ రద్దు

Nandyal Court Revoked SI and Constable Bail Over Family Suicide Case - Sakshi

డిసెంబర్ 2 వ తేదీ లోగా నంద్యాల జిల్లా కోర్టులో హాజరు కావాలని ఆదేశం

సాక్షి, కర్నూలు జిల్లా: అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్ల బెయిల్‌ను నంద్యాల కోర్టు రద్దు చేసింది. అబ్దుల్ సలాం కేసులో ప్రభుత్వం తరపున ఏపీ హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విన్న నంద్యాల కోర్టు.. ఆయన మాటలకు ఏకీభవించింది. దాని ప్రకారం సీఐ సోమశేఖర్‌రెడ్డి‌, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ల బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీసీ సెక్షన్ 306ను అమలు పరుస్తూ బెయిల్ రద్దు చేసినట్లు కోర్టు వెల్లడించింది. డిసెంబర్ 2 వ తేదీ లోగా నంద్యాల జిల్లా కోర్టులో హాజరు కావాలని సీఐ సోమశేఖర్ రెడ్డిని, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లని నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి మొక సువర్ణ రాజు ఆదేశించారు. ( సెల్ఫీ వీడియో: అందుకే చనిపోతున్నాం.. )

అబ్దుల్‌ సలాం (45), అతని భార్య నూర్జహాన్‌ (38), కుమారుడు దాదా ఖలందర్‌ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3వ తేదీన గూడ్స్‌ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సలాం, అతని భార్య నూర్జహాన్‌ తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి రాగా.. దీనిపై స్పందించిన సీఎం జగన్‌ తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్‌ను ఆదేశించారు. దీంతో బెటాలియన్స్‌ ఐజీ శంకబ్రతబాగ్జి, గుంటూరు అడిషనల్‌ ఎస్పీ హఫీజ్‌ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. నంద్యాల వన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌ను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసందే. ఈ కేసులో కేసులో సీఐ సోమశేఖర్‌ రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను అరెస్ట్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top