ఏపీ: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం | Minister Says YSR Pension Kanuka Arrangements Completed | Sakshi
Sakshi News home page

ఏపీ: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం

Sep 30 2020 11:01 AM | Updated on Sep 30 2020 11:01 AM

Minister Says YSR Pension Kanuka Arrangements Completed - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధమైందని రాష్ట్ర గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 'వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకను నవంబరు 1న రాష్ట్ర వ్యాప్తంగా 61.65 లక్షల మంది లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా నేరుగా అందించనుంది. అందుకుగానూ, రూ. 1,497.88 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలలో కొత్తగా 34,907 మందికి పెన్షన్‌ మంజూరు చేశారు. కొత్త పెన్షన్‌దారుల కోసం రూ. 8.52 కోట్లు విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.52 లక్షల మంది వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల చేతులకే పెన్షన్లు అందించనున్నారు. ఈ నెల నుంచి సైనిక సంక్షేమ పెన్షన్లు కూడా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. 847 సైనిక సంక్షేమ పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.42.35 లక్షలు విడుదల చేసింది. పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌బిఐఎస్ అమలు చేస్తున్నాం' అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.  (5న జగనన్న విద్యా కానుక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement