వేటపాలెం సొసైటీపై విచారణ చేపట్టాలి: కన్నబాబు

సాక్షి, విజయవాడ: ప్రకాశం జిల్లా చీరాల మండలం వేటపాలెం కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆర్థిక వ్యవహారాలపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. ఈ సొసైటీలో అవకతవకలు జరిగాయంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై వాస్తవాలతో నివేదిక అందజేయాలన్నారు.
డిపాజిట్‌దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నివేదిక ఆధారంగా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సహకార శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో కలిసి పని చేస్తున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. వేటపాలెం సొసైటీ కార్యదర్శి, సిబ్బందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.