
పోలీసుల అదుపులో ఉన్న వేణు, వినోద్
జలదంకి మండలం అన్నవరంలో భారీగా అక్రమ మైనింగ్
చిత్రీకరించిన టీవీ జర్నలిస్టు, సోషల్ మీడియా యాక్టివిస్టులు
క్రషర్ సిబ్బందిని వారిపైకి పంపిన ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి
ఇద్దరిని పట్టుకుని క్వారీలోనే చెట్టుకు కట్టేసి తీవ్రంగా దాడి
చేతుల్లో కత్తులు పెట్టి.. ఎమ్మెల్యే హత్యకు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి
పురమాయించినట్లు బెదిరించి వీడియోలు
ఎమ్మెల్యే అక్రమ మైనింగ్, కావలిలో మనీస్కాంలపై తరచూ నిలదీస్తున్న ప్రతాప్‌కుమార్‌రెడ్డి
డైవర్షన్ పాలిటిక్స్ కుట్రల్లో భాగంగానే మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు
సాక్షి టాస్క్ ఫోర్స్ : కావలి టీడీపీ ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి తన క్వారీల్లో క్రూర ‘కావ్య’ం ప్రదర్శించారు. ఆయన అక్రమ మైనింగ్ దందాను బయటపెట్టేందుకు ప్రయత్నించిన టీవీ జర్నలిస్టు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై దారుణంగా దాడి చే యించారు. బిహార్‌లోని పరిస్థితులను తలపించే లా హింసాత్మకంగా ప్రవర్తించారు. వారి చేతుల్లో కత్తులు పెట్టి... వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పంపడంతో ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని చంపడానికి వచ్చామని చెప్పిస్తూ వీడియో తీసి, అక్రమ కేసులు పెట్టి పోలీసులకు అప్పగించారు.
మనీ స్కాం.. అక్రమ మైనింగ్
జలదంకి మండలం అన్నవరంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురురాఘవేంద్ర స్టోన్ క్రషర్ పేరుతో అక్రమ మైనింగ్ చేపడుతున్నారు. ప్రభుత్వానికి రూ.కోట్లలో రాయల్టీ, కరెంట్ చార్జీలు ఎగవేశారు. అనధికారికంగా ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో మెటల్ తవ్వుతూ రూ.వందల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారు. మొత్తమ్మీద రూ.వెయ్యి కోట్లకుపైగా అక్రమంగా సంపాదించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఈ ఏడాది కావలిలో రూ.వందల కోట్ల మనీ స్కామ్ జరిగింది. పెద్దల పాత్ర ఉండడంతో ఎమ్మెల్యే, పోలీసులు దీన్ని పక్కదోవ పట్టించారు.
ఇందుకుగాను ఎమ్మెల్యేకు రూ.250 కోట్ల ముడుపులు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇటీవల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కక్షపూరిత రాజకీయాలతో వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బందిపెట్టసాగారు. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అసభ్యంగా దూషిస్తూ అంతు చూస్తానని బహిరంగంగానే బెదిరించారు. అయినా, వెనక్కుతగ్గని ప్రతాప్‌కుమార్‌రెడ్డి... ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అరాచకాలు, దోపిడీలు, దాషీ్టకాలు, అక్రమాలను తరచూ మీడియాకు వెల్లడిస్తున్నారు.
మనీ స్కామ్ బాధితులకు అండగా తన కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేయడంతో ఒక్కొక్కరుగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పరిణామాలతో కావ్య కృష్ణారెడ్డి పన్నాగం పన్నారు. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేశారు.
సోషల్ మీడియా యాక్టివిస్టులు వెళ్తే...
అన్నవరంలోని ఎమ్మెల్యే క్వారీల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను కావలి సోషల్ మీడియా యాక్టివిస్టు వేణు, అన్నవరం వాసి శ్రావణ్‌కుమార్, అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన వినోద్ వీడియో తీస్తుండగా క్వారీ క్రషర్ సిబ్బంది గుర్తించి ఎమ్మెల్యేకు చెప్పారు. శ్రావణ్‌కుమార్ పారిపోగా మిగిలిన ఇద్దరిని చెట్టుకు కట్టేసి ఇష్టమొచ్చినట్లు కొట్టినట్లు తెలుస్తోంది. ఉదయం 12.30 నుంచి 3 గంటలపాటు తీవ్రంగా హింసించారు. చంపేస్తామంటూ భయపెట్టారు.
అనంతరం తమ క్రషర్ వద్దకు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి రౌడీలను పంపించారంటూ జలదంకి ఎస్‌ఐ లతీఫున్నీసాకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వచ్చి.. ఇద్దరిని స్టేషన్‌కు తరలించారు. నిమిషాల్లోనే పోలీసులు వారిని కారులో కలిగిరి సీఐ కార్యాలయానికి, అక్కడినుంచి వివిధ స్టేషన్లకు తిప్పినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై ఎస్‌ఐ లతీఫున్నీసాను వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా అందుబాటులోకి రాలేదు.