AP Rainfall Weather Update: Light To Moderate Rains In Some Places In Statet For Next Three Days - Sakshi
Sakshi News home page

మూడురోజులు తేలికపాటి వర్షాలు 

Jul 29 2023 4:22 AM | Updated on Jul 29 2023 9:25 AM

Light rains for three days - Sakshi

సాక్షి, విశాఖపట్నం:  రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవన ద్రోణి, నైరుతి రుతుపవనాల చురుకుదనం ప్రభావంతో ఐదారు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అల్పపీడనం బలహీనపడడంతో పాటు నైరుతి రుతుపవనాల చురుకుదనం కూడా తగ్గింది. ఫలితంగా శుక్రవారం నుంచి వానలు  చిరుజల్లులకే పరిమతమయ్యాయి.

శుక్రవారం   కర్నూలు జిల్లా కామవరంలో మాత్రమే గరిష్టంగా 1.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. మరెక్కడా ఒక్క సెంటీమీటరుకు మించి వర్షం కురవలేదు.   రానున్న మూడురోజులు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు  కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.   

Advertisement
 
Advertisement
Advertisement