ఏపీ శాసన మండలి ఛైర్మన్‌గా మోషేన్‌రాజు

Koyye Moshen Raju Takes Charge As Chairman Of AP Legislative Council - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి ఛైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు బాధ్యతలు స్వీకరించారు. మోషేన్‌రాజును చైర్‌వద్దకు తీసుకొచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోషేన్‌రాజు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా మోషేన్‌రాజుకు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.

చదవండి: మా అమ్మ, చెల్లెలు, బాబాయ్‌ గురించి చంద్రబాబే మాట్లాడారు: సీఎం జగన్‌ 

వైఎస్సార్‌ కుటుంబం ఎంతో మంది సామాన్యులను ఉన్నతస్థాయికి తీసుకొచ్చిందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సీఎం జగన్‌ సముచిత స్థానం కల్పిస్తున్నారని మోషేన్‌రాజు అన్నారు. దళితుడిని ఉన్నతస్థాయిలో కూర్చొబెట్టిన ఘనత సీఎం జగన్‌దని ఆయన పేర్కొన్నారు. ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు. ఎప్పుడూ వైఎస్సార్‌ కుటుంబంతో ఉండేందుకు ఇష్టపడతానన్నారు. రాజకీయాలకు కులం, డబ్బు అవసరం లేదు. ప్రజల విశ్వాసం ఉంటే చాలని నమ్మిన నాయకుడు వైఎస్‌ జగన్ అని మోషేన్‌ రాజు అన్నారు.

చదవండి: అసెంబ్లీలో టీడీపీ హైడ్రామా.. కన్నీళ్లు, వాకౌట్‌ అంటూ పచ్చ మీడియా అతి

కొయ్యే మోషేన్‌ రాజు ప్రస్థానమిది.. 
జననం: 1965, ఏప్రిల్‌ 10 
తల్లిదండ్రులు: కొయ్యే సుందరరావు, మరియమ్మ 
స్వగ్రామం: పశ్చిమ గోదావరి జిల్లా 
భీమవరంలోని గునుపూడి 
విద్యాభ్యాసం: డిగ్రీ 

గతంలో చేపట్టిన పదవులు 
► 1987 నుంచి వరుసగా నాలుగుసార్లు మునిసిపల్‌ కౌన్సిలర్‌గా, రెండుసార్లు ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు.  
► ఏపీసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా, కాంగ్రెస్‌ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా, యూత్‌ కాంగ్రెస్‌ భీమవరం పట్టణ అ«ధ్యక్షుడిగా వివిధ పదవులు నిర్వహించారు. 
► కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  పార్టీకి మోషేన్‌ రాజు సేవలను గుర్తించిన సీఎం జగన్‌ గవర్నర్‌ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top