ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

Published Sun, Oct 2 2022 3:18 PM

Kanaka Durga Temple: CM YS Jagan Vijayawada Tour Live Updates - Sakshi

సాక్షి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్‌.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు.

అమ్మవారి ఆలయంలో సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు

  సీఎం జగన్‌కు అమ్మవారి ప్రసాదం,  చిత్రపటాన్ని అందజేసిన దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.

 అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

► ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం జగన్ తలకు పరివేష్టం చుట్టిన ఆలయ అర్చకులు.

► పూర్ణకుంభంలో సీఎం జగన్‌కు స్వాగతం పలికిన ఆలయ అధికారులు

► పంచెకట్టులో అమ్మవారి దర్శనానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్. 

► ఇంద్రకీలాద్రి చేరుకున్న సీఎం జగన్‌.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

► సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ.

Advertisement
 
Advertisement
 
Advertisement