
తాడేపల్లి ; ఇటీవల శ్రీలంక జైలు నుంచి విడుదలైన కాకినాడ మత్స్యకారులు.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 7వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు మత్స్యకారులు.
దీనిలో భాగంగా 54 రోజుల తర్వాత శ్రీలంక జైలు నుంచి విడుదల కావడానికి వైఎస్సార్‌సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఎంతో సహకరించారని వైఎస్ జగన్‌కు వివరించారు సదరు మత్స్యకారులు. ఈ క్రమంలో శ్రీలంకలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యల గురించి వైఎస్ జగన్‌కు వివరించారు.