Jagananna Gorumudda Scheme 2022: New Mid Day Meal Menu For Students - Sakshi
Sakshi News home page

Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు

Published Fri, Nov 18 2022 5:59 PM

Jagananna Gorumudda Scheme 2022: New Mid Day Meal Menu for Students - Sakshi

సీతంపేట: సర్కారు బడుల్లో ఈ నెల 21 నుంచి కొత్త మెనూ అమలుకానుంది. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ‘గోరుముద్ద’ను ప్రభు త్వం వడ్డించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా విభాగం మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిదీమీనా ఉత్తర్వు లు జారీ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మెనూను పక్కాగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.  

మెనూ అమలు ఇలా...  
సోమవారం:  ప్రస్తుత మెనూ: అన్నం, పప్పుచారు, కోడిగుడ్డుకూర, చిక్కీ               
కొత్తమెనూ: హాట్‌పొంగల్, ఉడికించిన కోడిగుడ్డు/ కూరగాయల పులావ్, కోడిగుడ్డుకూర, చిక్కీ 

మంగళవారం: ప్రస్తుతం: చింతపండు/నిమ్మకాయ పులిహోర,టమాట పప్పు, ఉడికించిన కోడిగుడ్డు  
కొత్తమెనూ: చింతపడు/నిమ్మకాయ పులిహోరా, టమాట పచ్చడి/దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు  

బుధవారం: ప్రస్తుతం: కూరగాయల అన్నం, బంగళాదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ  
కొత్తమెనూ: కూరగాయల అన్నం, బంగాళదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ 

గురువారం: ప్రస్తుతం: కిచిడి, టమాటపచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు 
కొత్తమెనూ: సాంబార్‌బాత్, ఉడికించిన కోడిగుడ్డు  

శుక్రవారం: ప్రస్తుతం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ 
కొత్తమెనూ: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ  

శనివారం:  ప్రస్తుత మెనూ: అన్నం, సాంబార్, తీపిపొంగలి 
కొత్తమెనూ: ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపిపొంగలి 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement