188 పనిదినాలు.. 47 సెలవులు

Intermediate Education Calendar 2021-22 was Released - Sakshi

4 యూనిట్‌ టెస్టులు, అర్ధసంవత్సర, ప్రీ ఫైనల్‌ పరీక్షలు

మార్చి మొదటి వారంలో థియరీ పబ్లిక్‌ పరీక్షలు

2022 ఏప్రిల్‌ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు

2021–22 ఇంటర్మీడియట్‌ విద్యా క్యాలెండర్‌ విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ విద్యకు సంబంధించి 2021–22 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ బోర్డు క్యాలెండర్‌ విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో 188 పనిదినాలున్నాయి. కోవిడ్‌ కారణంగా అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఫస్టియర్‌ విద్యార్థులకు తరగతులు, పరీక్షల నిర్వహణ వంటి ప్రక్రియలపై ఈ క్యాలెండర్‌ రూపొందించింది. సెకండియర్‌ విద్యార్థులకు జూలై 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించిన బోర్డు ఈనెల 16 నుంచి ప్రత్యక్ష తరగతులు కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్టియర్‌ విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను ఈ ఏడాది ఆన్‌లైన్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేసిన బోర్డు ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీని ఈనెల 27వ తేదీ వరకు పొడిగించింది. అడ్మిషన్లు పూర్తయిన అనంతరం సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఫస్టియర్‌ విద్యార్థులకు తరగతులను ప్రారంభించనుంది. 

47 సెలవులు
ఇంటర్‌ బోర్డు క్యాలెండర్‌ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో 47 సెలవుదినాలున్నాయి. అన్ని రెండో శనివారాలు పనిదినాలుగానే ఉంటాయి. టర్మ్‌ సెలవులు లేవు. వేసవి సెలవుల్లో అన్ని యాజమాన్యాల్లోని జూనియర్‌ కాలేజీలను మూసి ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు అన్ని ఆదివారాలు, పబ్లిక్‌సెలవుదినాలను తప్పనిసరిగా పాటించాలి. అడ్మిషన్లు పూర్తిగా బోర్డు ప్రకటించిన షెడ్యూళ్లలో మాత్రమే జరుగుతాయి. విద్యార్థులను తమ కాలేజీల్లో చేరేలా ఒత్తిడి చేయడం, తమ కాలేజీ ఫలితాలు అంటూ ఆకర్షించేలా ప్రలోభపెట్టడం వంటివి చేయరాదు. హోర్డింగులు, పాంప్లేట్లు, పత్రికలు, టీవీల్లో ప్రకటనలు చేయరాదు. పబ్లిక్‌ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేలా చేస్తామని హామీలివ్వడం నిబంధనలకు విరుద్ధమని, ఇలా చేస్తే చర్యలుంటాయని కాలేజీల యాజమాన్యాలకు బోర్డు స్పష్టం చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top