మళ్లీ రాజంపేటకు ఐఏఎస్‌ అధికారి !

IAS Officer Coming Soon For Rajampeta YSR Kadapa - Sakshi

రాజంపేట:  రాజంపేట రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో జిల్లా కలెక్టరేట్‌ తర్వాత సబ్‌ కలెక్టరేట్‌ ఉంది. ఇక్కడికి మళ్లీ ఐఏఎస్‌ క్యాడర్‌ కలిగిన అధికారి కేతన్‌గర్గ్‌ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బ్రిటిష్‌ పాలకుల నుంచి రాజంపేట రెవెన్యూ డివిజన్‌కు సబ్‌కలెక్టరుగా ఐఏఎస్‌ల నేతృత్వంలో రెవెన్యూ పాలన కొనసాగింది. 24 మంది సబ్‌కలెక్టరుగా ఇక్కడ పనిచేశారు. చివరిగా సబ్‌కలెక్టరుగా ప్రీతిమీనా పనిచేసి వెళ్లారు. అప్పటి నుంచి ఐఎఎస్‌ హోదా కలిగిన వారిని ఇక్కడ సబ్‌కలెక్టరుగా అప్పటి ప్రభుత్వం నియమించలేదు. తర్వాత ఆర్టీవోలుగా విజయసునీత, ప్రభాకర్‌పిళ్‌లై, వీరబ్రహ్మం, నాగన్నలు పనిచేశారు. ప్రస్తుతం ధర్మచంద్రారెడ్డిలు ఆర్డీవో కొనసాగారు. వైఎస్సార్‌సీపీ సర్కారు హయాంలో మళ్లీ రాజంపేటకు ఐఏఎస్‌ హోదా కలిగిన అధికారిని నియమించడం విశేషం. 2018 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన  కేతన్‌గర్గ్‌ విజయనగరంలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేశారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top