నేడు రాయలసీమలో విస్తారంగా వర్షాలు | Heavy Rains In Rayalaseema today | Sakshi
Sakshi News home page

నేడు రాయలసీమలో విస్తారంగా వర్షాలు

Aug 23 2021 2:58 AM | Updated on Aug 23 2021 2:58 AM

Heavy Rains In Rayalaseema today - Sakshi

సాక్షి, విశాఖపట్నం: కోస్తా, రాయలసీమల్లో సోమవారం, మంగళవారం అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా రాయలసీమలో సోమవారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.

అరేబియా సముద్రానికి సమీపంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీనివల్ల తేమగాలులు రాయలసీమ వైపు కదులుతున్నాయి. అదేవిధంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత 24 గంటల్లో పెద్దపల్లిలో 8.9, చంద్రగిరిలో 6.7, రామచంద్రాపురంలో 6.6, తిరుపతిలో 6.2, కుప్పంలో 5.0, పెద్దారవీడులో 4.9, శ్రీరంగరాజపురంలో 4.2 సెం.మీ వర్షపాతం నమోదైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement