ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Government schemes should be taken to the people - Sakshi

నరసాపురం రూరల్‌: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ మండల కన్వీనర్‌ దొంగ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. మండలంలోని వేములదీవి ఈస్ట్, వేములదీవి వెస్ట్, బియ్యపుతిప్ప  గ్రామాల్లో పార్టీ నూతన గ్రామ కమిటీల నియామక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కమిటీలను ప్రకటించారు.

వేములదీవి ఈస్ట్‌ గ్రామ కమిటీ గౌరవాధ్యక్షునిగా తిరుమాని వెంకటేశ్వరరావు, అధ్యక్షులుగా తిరుమాని అర్జునరావు, ఉపాధ్యక్షునిగా తిరుమాని నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా దాసరి సువర్ణరాజు, కార్యదర్శులుగా తిరుమాని రాంబాబు, కొల్లాటి వెంకటేశ్వర్లు, సహయ కార్యదర్శిగా తిరుమాని కనకరాజులతో పాటు పలువురు సభ్యులుగా ఎంపికయ్యారు. అలాగే వేములదీవి వెస్ట్‌ పంచాయతీ గ్రామ కమిటీ గౌరవాధ్యక్షులుగా మురాల సోమయ్య, ఆకుల పెద్దిరాజు, తిరుమాని వెంకటేశ్వర్లు, జక్కంశెట్టి పల్లయ్య ఎంపిక కాగా అధ్యక్షునిగా మామిడిశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఒడుగు రాంబాబు, ఈవన నాగరాజు, కారిపల్లి దాసు, జి నర్శింహమూర్తి ఎంపికయ్యారు. బియ్యపుతిప్ప గ్రామ కమిటీ అధ్యక్షునిగా చింతా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఒడుగు శ్రీను, కార్యదర్శులుగా సంగాని ఆంజనేయులు, ఒడుగు వీర్రాజులతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. వీరందరినీ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు అభినందించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top