పల్నాటి చరిత్ర, సంస్కృతి బాగా ఆకర్షించాయి

Gaddar Says History Of Palnadu Attracts Him At Macherla - Sakshi

ప్రజా గాయకుడు గద్దర్‌

కారంపూడి (మాచర్ల): పల్నాటి చరిత్ర, సంస్కృతి తనను బాగా ఆకర్షించాయని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. పల్నాడు చరిత్రపై ప్రత్యేక గీతాలు రాస్తానని, వీర కన్నమదాసు చరిత్రను అధ్యయనం చేస్తానని చెప్పారు. గద్దర్, సినీ దర్శక నిర్మాత సత్యారెడ్డితో కలిసి గురువారం పల్నాటి రణక్షేత్రం కారంపూడిలోని పల్నాటి వీరుల గుడిని దర్శించారు. ఈ సందర్భంగా అలనాటి పల్నాటి యుద్ధంలో కన్నమదాసు వాడిన భైరవ ఖడ్గాన్ని చేబూనిన గద్దర్‌ తన జన్మ ధన్యమైందన్నారు.

సత్యారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. తన వంతుగా ప్రజల్లో చైతన్యం రగిల్చేందుకు ‘విశాఖ ఉక్కు సత్యాగ్రహం’ పేరుతో సినిమా నిర్మిస్తున్నామన్నారు. ఈ సినిమాకు గద్దర్‌ పాటలు రాయటమే కాకుండా ఒక పాటలో నటిస్తున్నారని తెలిపారు. త్వరలో పల్నాడు కథాంశంతో సినిమాను నిర్మిస్తానని, దానికి వేముల శ్రీనివాసరావు కథా సహకారం 
అందిస్తారని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top