
గోపాలకృష్ణారావు (ఫైల్)
సాక్షి, రాజోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బిక్కిన గోపాలకృష్ణారావు (83) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన స్వగ్రామం తాటిపాకలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రాజోలు నుంచి అప్పటి దేవదాయ శాఖ మంత్రి రామలింగరాజుపై పోటీ చేసి గోపాలకృష్ణారావు గెలుపొందారు.
అగ్రికల్చరల్ బీఎస్సీ చదివిన ఆయన తాటిపాక గ్రామంలోనే ఉంటూ వ్యవసాయంపై ఆసక్తి చూపుతూ పలు పంటలు పండించేవారు. 1950వ దశకంలో తాటిపాక సర్పంచ్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గోపాలకృష్ణారావు మృతి పట్ల రాజోలు ప్రస్తుత ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవీ సూర్యనారాయణరాజు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు అల్లూరు కృష్ణంరాజు, మానేపల్లి అయ్యాజీ వేమా, పాముల రాజేశ్వరీదేవి సంతాపం వ్యక్తం చేశారు.