సాక్షి, విశాఖపట్నం: నగరంలో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున 4:16 నుంచి 4:20 నిమిషాల మధ్య ప్రకంపనలు వచ్చాయని ప్రజలు అంటున్నాయి. తెల్లవారు జామున కావడంతో కొద్ది మంది మాత్రమే ప్రకంపనలను గుర్తించారు.
మురళీనగర్, రాంనగర్, అక్కయ్య పాలెం, సీతమ్మధార, సహా పాలు ప్రాంతాల్లో భూమి కంపించింది. పలు కాలనీ వాసులు భయంతో బయటకు వచ్చారు. అల్లూరి జిల్లా జీ.మాడుగులలో భూకంప కేందాన్ని గుర్తించారు. భూమి లోపల 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉంది.



