301 సంస్కరణలను అమలు చేయండి | DPIIT directed the states to implement 301 Regulations by November | Sakshi
Sakshi News home page

301 సంస్కరణలను అమలు చేయండి

Sep 13 2020 5:19 AM | Updated on Sep 13 2020 5:19 AM

DPIIT directed the states to implement 301 Regulations by November - Sakshi

సాక్షి, అమరావతి: ప్రస్తుత సంవత్సరం సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ – ఈవోడీబీ) కోసం 301 సంస్కరణలను అమలు చేయాలని రాష్ట్రాలకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ) సూచించింది. 2020–21 ర్యాంకుల కోసం 15 విభాగాల్లో ఈ సంస్కరణలను నవంబర్‌లోగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. 

► 2019 సంవత్సరానికి గాను 187 సంస్కరణలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈవోడీబీ ర్యాంకుల్లో మొదటి స్థానం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు విడుదల కావడంతో వీటి అమలుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ శ్రీకారం చుట్టింది.
► వీటి ప్రకారం కొన్ని చట్టాలను సవరించాల్సి ఉండగా, మరికొన్నింటి కోసం ప్రత్యేక అప్లికేషన్లను అభివృద్ధి చేయాల్సి ఉంది.
► సంస్కరణల అమలుకు రెండున్నర నెలలే సమయం ఉండటంతో అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహించి కొత్త మార్గదర్శకాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పరిశ్రమల శాఖ చేపట్టింది.
► ఈ సంస్కరణలను అమలు చేశాక వీటి ప్రయోజనం పొందిన వారి నంబర్లు తీసుకుని సర్వే నిర్వహించడం ద్వారా ర్యాంకులను నిర్థారిస్తారు. అయితే సర్వేకి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు.
► ఈ ఏడాది కొత్తగా పర్యాటకం, టెలికాం, ఆతిథ్యం, ట్రేడ్‌ లైసెన్స్, హెల్త్‌ కేర్, తూనికలు–కొలతలు, సినిమా హాళ్లు, సినిమా షూటింగ్‌లకు సంబంధించిన సంస్కరణలను ప్రవేశపెట్టినట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ పేర్కొంది. 
► సింగిల్‌ విండో విధానంలో ఆన్‌లైన్‌ దరఖాస్తు నమోదు దగ్గర్నుంచి రుసుంల చెల్లింపులు, ధ్రువీకరణ పత్రాల స్వీకరణ, థర్డ్‌ పార్టీ వెరిఫికేషన్‌ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement