
ఇద్దరు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. అమిత్ షా పర్యటన వేళ బీజేపీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పుపై నేతలు అంసతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలపై పార్టీ నేతలు అంసతృప్తితో ఉన్నట్లు చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పు జరగటం విభేదాలను బట్టబయలు చేసింది. సీనియర్లను సంప్రదించకుండా జిల్లా అధ్యక్షులను మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ తమ పదవులకు తుమ్మల ఆంజనేయులు, కుమారస్వామిలు రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై నిరసన గళం వినిపించారు.
ఇదీ చదవండి: టీడీపీ స్థానిక నాయకులు, ఎన్‌ఆర్‌ఐల మధ్య సీట్ల పేచీ