తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠద్వార దర్శనాలు | Devotees Huge Crowd in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠద్వార దర్శనాలు

Jan 19 2025 9:10 AM | Updated on Jan 19 2025 9:10 AM

Devotees Huge Crowd in Tirumala

సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం (జనవరి 18) 9వ రోజు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. గత ఎనిమిది రోజులలో తిరుమలేశుని వైకుంఠ ద్వారం ద్వారా మొత్తం 5లక్షల 36 వేల 277 మంది దర్శించుకున్నారు. ఇలా ఉండగా ఆదివారం(జనవరి 19)తో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. 

తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది. శనివారం అర్ధరాత్రి వరకు 75,931 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో  25,717  మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.40 కోట్లు సమర్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తోంది.  నేడు విఐపీ దర్శనాలు రద్దు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement