చీర ఆర్డర్‌ చేస్తే చిరిగిన ప్యాంటొచ్చింది | Customer From NTR District Got Torn Pants Instead Saree | Sakshi
Sakshi News home page

చీర ఆర్డర్‌ చేస్తే చిరిగిన ప్యాంటొచ్చింది

Dec 11 2022 7:16 PM | Updated on Dec 11 2022 8:34 PM

Customer From NTR District Got Torn Pants Instead Saree - Sakshi

పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట, ఎన్టీఆర్‌ జిల్లా): సోదరికి కానుక ఇద్దామని చీర ఆర్డర్‌ చేస్తే సగానికి చిరిగిన పాత ప్యాంటు డెలివరీ అయిన ఘటన పెనుగంచిప్రోలులో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు పండుగకు తన సోదరికి చీర కొనిద్దామనుకున్నాడు. ఓ ఆన్‌లైన్‌ యాప్‌లో రూ.550 విలువ గల చీర బుక్‌ చేశాడు.

శనివారం ఆర్డర్‌ అందింది. డెలి వరీ బాయ్‌కు డబ్బు చెల్లించి, కవర్‌ను తెరిచి చూడగా దానిలో చీరకు బదులు చిరిగిన పాత ప్యాంట్‌ అదీ ఒక కాలు వరకు మాత్రమే ఉండ టంతో అవాక్కయ్యారు. ఇదేమని డెలివరీ బాయ్‌ను ప్రశ్నించగా తమకేం తెలియదని, రిటన్‌ ఆప్షన్‌ ఉంటుంది చేసుకోమంటూ సలహా ఇచ్చాడు. జరిగిన దానికి తానేమీ చేయలేనని, ఆన్‌లైన్‌ వ్యాపారంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పిమరీ వెళ్లాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement