వ్యాక్సిన్ల వ్యయం రూ.75 వేల కోట్లు! 

Covid Vaccines cost Rs 75,000 crore - Sakshi

ఇన్వెస్టెక్‌ సెక్యూరిటీస్‌ అంచనా 

త్వరలో మరో ఐదు వ్యాక్సిన్లు అందుబాటులోకి.. 

జూలై నుంచి వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకునే అవకాశం 

వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలకు రూ.15 వేల కోట్ల లాభాలొస్తాయని అంచనా 

లాభాల్లో అగ్రస్థానం సీరం, భారత్‌ బయోటెక్‌లదే 

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఏడాది వ్యాక్సిన్ల కోసం మన దేశం అక్షరాలా రూ.75 వేల కోట్లను వ్యయం చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు అన్నీ కలిపి 2021లో ఈ మొత్తాన్ని వెచ్చించనున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం వ్యాక్సిన్లకు ఎంత వ్యయం అవుతుందనే విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఇన్వెస్టెక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్‌–వీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరో ఐదు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, జూలై నుంచి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని తన నివేదికలో పేర్కొంది. ఇండియాలో ప్రతిరోజు 70 లక్షల నుంచి 80 లక్షల డోసులు వేసే సామర్థ్యం ఉన్నప్పటికీ వ్యాక్సిన్ల సరఫరా లేదు. సామర్థ్యంలో 30 శాతం మాత్రమే సరఫరా అవుతున్నట్టు పేర్కొంది. 

అక్టోబర్‌ నాటికి పూర్తి స్థాయికి.. 
దేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారందరికీ టీకా వేయించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభంకాదని ఇన్వెస్టెక్‌ తేల్చిచెప్పింది. జూలై నుంచి దేశంలోకి కొత్తగా క్యాడిలా హెల్త్‌కేర్‌ అభివృద్ధి చేస్తున్న జెడ్‌వైకోవీడీ, నోవాక్స్, స్పుత్నిక్‌ వీ సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జే అండ్‌ జే) వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. జూలై నుంచి దేశంలో వ్యాక్సిన్ల సరఫరా పెరిగి అక్టోబర్‌ నాటికి పూర్తి స్థాయికి చేరుకుంటుందని ఇన్వెస్టెక్‌ అంచనా వేసింది. అక్టోబర్‌ నాటికి వ్యాక్సిన్‌ సరఫరా పెరిగినా కేవలం 124 కోట్ల డోసులు మాత్రమే అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ ప్రకారం చూస్తే 18 ఏళ్లు నిండిన జనాభాలో 74 శాతం మందికి వ్యాక్సిన్‌ వేసే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఇది కూడా వ్యాక్సిన్‌ సరఫరా, కేంద్ర అనుమతులపై ఆధారపడి ఉంటుంది. 

వ్యాక్సిన్‌ సంస్థలకు లాభాలే లాభాలు 
2021లో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు లాభాల పంట పండనుందని ఇన్వెస్టెక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది, మొత్తం వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు ఈ ఏడాది లాభాల రూపంలో రూ.15 వేల కోట్లు రానున్నాయని అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా తొలుత ఉత్పత్తి ప్రారంభించిన సంస్థలు సీరం, భారత్‌ బయోటెక్‌లకు తీసుకోనుండగా.. ఆ తర్వాత స్థానాల్లో డాక్టర్‌ రెడ్డీస్‌ (స్పుత్నిక్‌–వీ), క్యాడిలా సంస్థలు లబ్ధి పొందుతాయని పేర్కొంది. ఫైజర్, జే అండ్‌ జే, బయలాజికల్‌–ఈ వంటి సంస్థలు ఈ రేసులో ఆలస్యంగా చేరుతుండటంతో ప్రారంభ లాభాలను పొందే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాయి.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

18-05-2021
May 18, 2021, 09:40 IST
‘‘అమ్మా.. నువ్వేదో దాస్తున్నాం. ఏదో జరిగింది. నాకు చెప్పడం లేదు కదా. చెప్పమ్మా ప్లీజ్‌’’
18-05-2021
May 18, 2021, 09:27 IST
కోవిడ్‌ చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని కేంద్ర ప్రభుత్వం సోమవారం తొలగించింది.
18-05-2021
May 18, 2021, 09:03 IST
బనశంకరి: కర్ణాటకలో బెళగావి జిల్లాలో కోవిడ్‌–19 మహమ్మారి వల్ల ఆదివారం వరకు 90 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మృత్యవాతపడ్డారు. జిల్లాలో...
18-05-2021
May 18, 2021, 08:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి తీవ్రరూపం దాలుస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టడి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో దేశంలో కరోనా...
18-05-2021
May 18, 2021, 08:34 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19తో కన్నవారిని వారిని పోగొట్టుకున్న చిన్నారుల పునరావాసం విధానాన్ని కేంద్రం ఖరారు చేసింది. కోవిడ్‌ మహమ్మారికి బలైపోయిన తల్లిదండ్రుల...
18-05-2021
May 18, 2021, 08:08 IST
కరోనా కోరల్లో కోలివుడ్‌ విలవిలలాడుతోంది. దర్శకుడు అరుణ్‌రాజ్‌ కామరాజ్‌కు భార్య హింధూజ, యువ నటుడు నితీష్‌ వీరా కరోనాతో కన్నుమూశారు..
18-05-2021
May 18, 2021, 04:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వేగం కాస్త నెమ్మదించినట్లుగా కనిపిస్తోంది. గత వారంలో మే 10 నుంచి...
18-05-2021
May 18, 2021, 04:48 IST
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి అనేక చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వర్తించే...
18-05-2021
May 18, 2021, 04:34 IST
సాక్షి, అమరావతి: గ్రామ పొలిమేరల్లోకి కూడా కరోనా రాకుండా సర్పంచుల నేతృత్వంలో పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని, కొత్తగా ఎన్నికైన...
18-05-2021
May 18, 2021, 04:29 IST
బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌ మైకోసిస్‌) వ్యాధికి గురవుతున్న వారి చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి, అందుకయ్యే ఖర్చును మొత్తం...
18-05-2021
May 18, 2021, 04:24 IST
మలక్‌పేట(హైదరాబాద్‌): ... అయినా ప్రైవేట్‌ ఆస్పత్రుల తీరు మారలేదు. అదే ధోరణి.. కాసుల కోసం అదే కక్కుర్తి.. బకాయి బిల్లు...
18-05-2021
May 18, 2021, 03:37 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా చేస్తున్న సీటీ స్కాన్, ఇతర పరీక్షలకు, పీపీఈ కిట్స్‌కు...
18-05-2021
May 18, 2021, 02:54 IST
బంజారాహిల్స్‌: రష్యా తయారీ స్పుత్నిక్‌–వి టీకాల కార్యక్రమం హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో తొలిడోసును డాక్టర్‌ రెడ్డీస్‌...
18-05-2021
May 18, 2021, 02:50 IST
రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడిలో భాగంగా విధించిన కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ...
18-05-2021
May 18, 2021, 02:36 IST
సాక్షి, జహీరాబాద్‌: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జె.గీతారెడ్డి కరోనా బారిన పడ్డారు. సోమవారం ఈ విషయాన్ని ఆమె...
18-05-2021
May 18, 2021, 02:22 IST
ఇది సంక్లిష్ట దశ.. భారతదేశంలో ప్రస్తుతం సంక్లిష్ట దశ కొనసాగుతోంది. రానున్న 6 నుంచి 18 నెలల పాటు ఈ వైరస్‌తో...
18-05-2021
May 18, 2021, 01:38 IST
సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌: కరోనా నుంచి కోలుకున్న చాలామందికి ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగలట్లేదు. బ్లాక్‌ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ రూపంలో...
18-05-2021
May 18, 2021, 01:23 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ రోగుల చికిత్స కోసం రాష్ట్రంలోని 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 324 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి...
18-05-2021
May 18, 2021, 00:48 IST
ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది కరోనా బాధితులు మరణించిన నేపథ్యంలో భారత్‌తో పాటు అనేక దేశాలు కోవిడ్‌–19 మహమ్మారి సెకండ్‌...
17-05-2021
May 17, 2021, 20:21 IST
న్యూఢిల్లీ: భార‌త్‌లో కోవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో కేవలం 26 మందిలో మాత్రమే రక్త స్రావం, రక్తం గడ్డకట్టడం వంటి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top