కరోనాపై కృష్ణాజిల్లా కలెక్టర్‌ పేరడి పాట 

Collector MD Imtiaz Writes Corona Awareness Song In Vijayawada - Sakshi

కరోనాపై పేరడి పాట రాసిన కలెక్టర్‌ ఇంతియాజ్

సాక్షి, విజయవాడ: కరోనాపై ప్రజలు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండి వైరస్‌ను నియంత్రించాలని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. కోవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినిమా పాటకు కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేరడి పాటను రాయగా ఆ పాటను చంద్రిక పాడారు. ఈ పాటను శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ విడుదల చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 36 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వైరస్‌పై ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా నిర్లక్ష్యంగా ఉంటే దాని బారిన పడతారన్నారు. కోవిడ్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. ఈనెల 30 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ కోవిడ్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చదవండి: ఎమ్మెల్యే వంశీకి పాజిటివ్‌

విజయదశమి శుభాకాంక్షలు 
జిల్లా ప్రజలకు కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే విజయదశమి అని, ఈ పండుగ ప్రజలందరికి విజయాలు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top