మీ మద్దతుకు.. మరోసారి సెల్యూట్‌: సీఎం జగన్‌

CM YS Jagan Tweet About YSRCP Plenary Meeting Grand Successful - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు అత్యంత ఘనంగా జరిగాయి. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలతో ప్లీనరీ ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. ప్లీనరీ జరుగుతున్న ప్రాంతంలో జాతీయ రహదారి వెంట ఇరువైపులా దాదాపు 20 కి.మీ. మేర ఎటు చూసినా జన ప్రవాహం, బారులు తీరిన వాహనాలే కనిపించాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది కాలి నడకన వేదిక వద్దకు వచ్చారంటే జన ప్రవాహాన్ని ఊహించవచ్చు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉరిమే ఉత్సాహంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆటోలు, ద్విచక్రవాహనాలపై చేరుకున్నారు.

ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా ముగియడంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా సంతోషాన్ని  పంచుకున్నారు. ‘నిరంతరం-దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు.. ఇవే నాకు శాశ్వత అనుబంధాలు.. కార్యకర్తలూ అభిమానుల సముద్రంగా మారిన ప్లీనరీలో.. చెక్కు చెదరని మీ ఆత్మీయతలకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీ మద్దతుకు... మీ జగన్‌ సెల్యూట్, మరోసారి!’ అని ట్వీట్‌ చేశారు.
చదవండి: అమర్‌నాథ్‌ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులు.. సీఎం జగన్‌ ఆరా.. కీలక ఆదేశాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top