
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో రెండు వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. నంద్యాల జాయింట్ కలెక్టర్ మౌర్య వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు. అనంతరం కడప ఆదిత్య ఫంక్షన్ హాలులో మేయర్ సురేష్‌బాబు కుమార్తె ఐశ్వర్య వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.