సీజేఐ చంద్రచూడ్‌తో సీఎం జగన్‌ మర్యాదపూర్వక భేటీ

CJI Chandrachud In Vijayawada Novotel Hotel - Sakshi

విజయవాడ: మూడు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్నారు భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌. శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొనే క్రమంలో.. ఈరోజు(గురువారం) రాత్రికి విజయవాడలో బసచేయనున్నారు. ఈ క్రమంలోనే నోవాటెల్‌ హోటల్‌కు చేరుకున్న సీజేఐ చంద్రచూడ్‌ను సీఎం జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. 

కాగా, తిరుపతి జిల్లా పర్యటన ముగించుకున్న సీజేఐకు సాదర వీడ్కోలు లభించాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను సీజేఐకి అందచేశారు.

రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు లక్ష్మణరావు,  టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, మూడవ అడిషనల్ జిల్లా జడ్జి వీర్రాజు, ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ కోటేశ్వరరావు, శ్రీకాళహస్తి ఆర్డీవో రామారావు, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు,  అడిషనల్ ఎస్పీ కులశేఖర్, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ ధనుంజయ నాయుడు, జిల్లా బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దినకర్ తదితరులు సీజేఐకి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top