చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత | Chittoor EX MLA Satyaprabha No More | Sakshi
Sakshi News home page

టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ కన్నుమూత

Nov 20 2020 10:15 AM | Updated on Nov 20 2020 10:16 AM

Chittoor EX MLA Satyaprabha No More  - Sakshi

సాక్షి, చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ (65) కన్నుమూశారు. అనారోగ్యంతో బెంగళూరులోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం రాత్రి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమెకు నివాళులు అర్పించడానికి జిల్లా నుంచి అభిమానులు, టీడీపీ నేతలు బెంగుళూరుకు బయల్దేరి వెళ్లారు. ఇటీవలే ఆమె కరోనా నుంచి కూడా కోలుకున్నారు.

కాగా టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు సతీమణి అయిన సత్యప్రభ.. ఆయన మృతితో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో రాజంపేట అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే సత్యప్రభ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement