ఫేక్‌ వీడియోకున్న విలువ.. సీఎం జగన్‌ ప్రాణానికి లేదా? | Chandrababu Threat CM Jagan Posani Sad For No One Reacts | Sakshi
Sakshi News home page

ఫేక్‌ వీడియోకున్న విలువ.. సీఎం జగన్‌ ప్రాణానికి లేదా?

May 1 2024 10:23 AM | Updated on May 1 2024 12:02 PM

Chandrababu Threat CM Jagan Posani Sad For No One Reacts

విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే మీరే చేపించుకున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు.

హైదరాబాద్‌, సాక్షి: చంద్రబాబు పబ్లిక్‌గా ఏపీ సీఎం జగన్‌ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్‌ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్‌ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌, YSRCP నేత  పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నో రోజులుగా సీఎం జగన్‌ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ‘రేపే నిన్ను(సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ..) చంపితే ఏం చేస్తారు’ అని చంద్రబాబు అడుగుతున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే మీరే చేపించుకున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇది దుర్మార్గం కాదా?. దీనిపై ఎవరూ స్పందించరా?. ఒక ఫేక్‌ వీడియోకి ఉన్న విలువ సీఎం జగన్‌ ప్రాణానికి లేదా?.. 

సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఆర్థిక నేరస్తులు. ఈ విషయం అందరికీ తెలుసు. అసలు సుజనా చౌదరి బీజేపీలోకి ఎందుకు మారారు? బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చా? అక్రమాలు చేసిన వాళ్లు బీజేపీలో ఉంటే శిక్ష పడదా?. మోదీగారు మీరు నిజాయితీవంతమైన నాయకులు. ఇలాంటి వారిని ప్రొత్సహించి మీ ఇమేజ్‌ను దెబ్బ తీసుకోకండి’’ అని పోసాని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement