
సాక్షి,అమరావతి: దోపిడీకి కాదేదీ అనర్హం అన్న రీతిలో చంద్రబాబు హయాంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ దోపిడీ రాజ్యంగా మారింది. కేవలం 10శాతం ఫినిషింగ్ పనులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్లకు రూ.524కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఫినిషింగ్ పనుల్లో ప్లంబింగ్, ఎలక్ట్రికల్, సెక్యూరిటీ, ల్యాండ్ స్కాపింగ్,ఇతర పనులున్నాయి. 90శాతం ఎమ్మెల్యే క్వార్టర్స్ పనులు గతంలోనే పూర్తి కాగా కేవలం 10శాతం పనులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.524 కోట్లు విడుదల చేయడం గమనార్హం.
ఇది చంద్రబాబు అండ్ కో దోపిడీకి నిదర్శనమని ప్రజాస్వామ్య వాదులు మండిపడుతున్నారు. కేవలం మిగిలి పోయిన 10శాతం పనులకు రూ.524కోట్లు కేటాయించడం ఏంటని వారు వారు ప్రశ్నిస్తున్నారు.