ఏలూరు: సాక్షి ఆఫీస్‌కు నిప్పంటించి.. టీడీపీ నేతల పైశాచికం | Andhra Pradesh: TDP Leaders Attacked The Eluru Sakshi Office; Latest Updates Here | Sakshi
Sakshi News home page

ఏలూరు: సాక్షి ఆఫీస్‌కు నిప్పంటించి.. టీడీపీ నేతల పైశాచికం

Jun 10 2025 12:26 PM | Updated on Jun 10 2025 7:44 PM

Andhra Pradesh: TDP Leaders Attacked The Eluru Sakshi Office; Latest Updates Here

సాక్షి,ఏలూరు:  తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. ఈరోజు(మంగళవారం, జూన్‌ 10) సైతం ‘సాక్షి’పై కుట్రపూరిత దాడులు కొనసాగుతున్నాయి. 

ఏలూరు జిల్లాలో టీడీపీ నేతల గూండాగిరి కొనసాగుతుంది. సాక్షి కార్యాలయంపై దెందులూరు నియోజకవర్గ టీడీపీ నేతలు దాడి చేశారు. పెట్రోల్  బాటిళ్ళు ,రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో కార్యాలయంలో ఉన్న సోఫా సెట్లు, ఫర్నిచర్  ఆగ్నికి ఆహుతయ్యాయి.  ఆఫీసు ఉద్యోగి కారు పాక్షికంగా ధ్వంసమైంది. గత, మూడు రోజులుగా సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ నేతలు భయానక వాతావరణం సృష్టించారు. అయినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సాక్షి కార్యాలయంపై మంగళవారం కూటమి మూకలు దాడులకు తెగబడ్డాయి. బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో దాడులకు పాల్పడ్డారు. రామకృష్ణారెడ్డి, బలరామకృష్ణ ఆధ్వర్యంలో సాక్షి కార్యాలయంపై దాడులక తెగబడ్డారు. సాక్షి కార్యాలయం బోర్డులో ధ్వంసం చేసి అరాచకం సృష్టించారు కూటమి నేతలు. 

ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు.ఈ క్రమంలోనే.. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’పై దాడులకు ఉసిగొలిపింది.

తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు.  ఈ దాడులపై రాష్ట్ర  వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement