‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు అవార్డుల పంట

Awards To Sakshi Telugu Daily Photo Journalists

స్పాప్‌ నిర్వహించిన జాతీయ పోటీల్లో 19 మందికి అవార్డులు

సాక్షి, అమరావతి: స్టేట్‌ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (స్పాప్‌) ‘వరల్డ్‌ ఫొటో జర్నలిజం డే’ సందర్భంగా నిర్వహించిన ‘5వ ఇండియా ప్రెస్‌ ఫొటో అవార్డ్స్‌–2020’ జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఎ.సతీష్‌ తీసిన ‘అన్నకు గోరుముద్ద’ ఫొటోకు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫొటోగ్రఫీ (ఎఫ్‌ఐపీ) గోల్డ్‌ మెడల్‌ లభించింది. ‘సాక్షి’ తెలుగు దినపత్రిక ఏపీ, తెలంగాణ ఫొటోగ్రాఫర్లు 19 అవార్డులు సాధించారు. 22 రాష్ట్రాల నుంచి 303 మంది ఫొటో జర్నలిస్టులు ఈ పోటీలో పాల్గొన్నారు.

ఓపెన్‌ కలర్‌ విభాగంలో వి.రూబెన్‌ (విజయవాడ)కు 3వ బహుమతి, ఫొటో జర్నలిజం విభాగంలో పి.లీలామోహన్‌ (వైజాగ్‌), ఎన్‌.రాజేష్‌రెడ్డి (హైదరాబాద్‌), ఎఫ్‌ఐపీ రిబ్బన్‌ విభాగంలో పి. విజయకృష్ణ (విజయవాడ). పి.శివప్రసాద్‌ (సంగారెడ్డి)లకు సర్టిఫికెట్‌ ఆఫ్‌ మెరిట్, ఎస్‌.లక్ష్మీపవన్‌ (విజయవాడ)కు యూత్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించాయి. కె.మోహనకృష్ణ (తిరుపతి), జి.వీరేష్‌ (అనంత), డి.హుస్సేన్‌(కర్నూలు), ఎండీ నవాజ్‌ (వైజాగ్‌), జయశంకర్‌ (శ్రీకాకుళం), పి.సతీష్‌కుమార్‌ (కాకినాడ), రియాజుద్దీన్‌ (ఏలూరు), జె.అజీజ్‌ (మచిలీపట్నం), ఎన్‌.కిశోర్‌ (విజయవాడ) కె.చక్రపాణి (విజయవాడ), పి.మనువిశాల్‌ (విజయవాడ), సురేశ్‌కుమార్‌ (హైదరాబాద్‌), భజరంగ ప్రసాద్‌ (నల్లగొండ)లకు  స్పాప్‌ నేషనల్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు దక్కాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top