
సాక్షి, మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌లో ఓ ప్రయివేటు ఆస్పత్రి ఆధ్వర్యంలో అనధికార కోవిడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోమవారం రాత్రి మంగళగిరి రూరల్ సీఐ శేషగిరిరావు, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారులు తనిఖీకి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కొంతమంది కోవిడ్ రోగులు అక్కడి నుంచి పారిపోయినట్టు సమాచారం. మిగిలిన వారిని విచారించగా.. తాము హోం క్వారంటైన్‌లో ఉండలేక హాయ్‌ల్యాండ్‌లో ఉంటున్నట్టు చెప్పారు. రోజుకు ఒక్కో రూమ్‌కు ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నట్టు తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.