కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌

AP SEC Review Meeting Over Panchayat Polls And Vaccination - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్‌ ఆదిత్యనాథ్‌, డీజీపీ గౌతం సవాంగ్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తదితరులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మీడియాతో మాట్లాడారు. (ఏకగ్రీవాలతో గ్రామ స్వరాజ్యం)

ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ రెండూ ఒకేసారి రావటం వల్ల.. పోలీసులకు కలిగే ఇబ్బందులను ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లాం అని గౌతమ్‌ సవాంగ్ తెలిపారు. వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది రాకుండా.. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచన చేస్తున్నామన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్‌ సిబ్బందిలో.. ఆరోగ్య సమస్యలున్నవారి విషయంలో మినహాయింపులపై ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియపై 13 జిల్లాల ఎస్పీలు.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top