టార్గెట్‌ వైఎస్సార్‌సీపీ.. అంబటి సహా పలువురిపై కేసులు | AP Police Case Filed Against YSRCP Leaders | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ వైఎస్సార్‌సీపీ.. అంబటి సహా పలువురిపై కేసులు

Jun 19 2025 11:24 AM | Updated on Jun 19 2025 12:34 PM

AP Police Case Filed Against YSRCP Leaders

సాక్షి, పల్నాడు: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెడుతూనే ఉంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటన సందర్భంగా పార్టీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

పల్నాడులో అనుమతులకు విరుద్ధంగా నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ చేశారని, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారంటూ వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, మాజీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొర్లకుంట వెంకటేశ్వర్లు తోపాటు మరికొంతమందిపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా కట్టెంపూడిలో బారికేడ్లు తొలగించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించి వారి పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ అంబటిపై కేసు ఫైల్‌ చేశారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement