పట్టణాల్లో వార్డుల సంఖ్య పెంపు | AP Municipal Ward Increase: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పట్టణాల్లో వార్డుల సంఖ్య పెంపు

Mar 25 2026 5:48 AM | Updated on Mar 25 2026 5:48 AM

AP Municipal Ward Increase: Andhra Pradesh

జనాభా ఆధారంగా పునర్విభజన  

కార్పొరేషన్లలో 60 నుంచి 120 డివిజన్లు

నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 23 నుంచి 52 వరకు వార్డులు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. జనాభా సంఖ్య ఆధారంగా కార్పొరేషన్లలో డివిజన్లు, మున్సిపాలిటీల్లో వార్డులను విభజించనున్నారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

దీని ప్రకా­రం నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డులు 23 నుంచి 52 మధ్య, కార్పొరేషన్లలో 60 నుంచి 120 వరకు డివిజన్లు ఉండాలని నిర్ణయించారు. చివరి సారిగా జరిగిన జనాభా లెక్కల ఆధారంగా వార్డుల విభజన ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, దేశంలో చివరిసారిగా 2011లో జనాభా లెక్కించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement