
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఏపీ గృహ నిర్మాణ శాఖలో చేపట్టిన రివర్స్ టెండరింగ్ సత్పాలితాలనిస్తోంది. తాజాగా వెల్లడైన నివేదికల్లో భారీగా ఆదా అయినట్టు గృహ నిర్మాణశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం తొలివిడతలో 6500 కోట్ల రూపాయలు మిగలనున్నాయి. ఒక్కో ఇంటి వ్యయంపై రూ.32,821 ఆదా అవుతున్నాయి.
ఒక్కో ఇంటికి 14 వస్తువులకు రూ. లక్షా 31 వేల 676 ఖర్చు అవుతుండగా.. రివర్స్ టెండరింగ్‌లో రూ. 88 వేల 854కు భారం తగ్గింది. లబ్ది దారులు కోరుకున్న ఐఎస్‌ఐ మార్క్ ఉన్న వస్తువులే ఏపీ ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఉచిత ఇసుక సరఫరాతో కలిపి లబ్ధిదారులకు 6500 కోట్ల రూపాయలు ఆదా అవనుంది. ఇసుక కాకుండా 14 రకాల వస్తువులపై 5 వేల 120 కోట్ల రూపాయలు ఆదా అవనుంది.
చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో 20న మొహర్రం సెలవు