‘నిబంధనలకు లోబడే లోకేష్‌ పాదయాత్ర జరగాలి’ | AP Govt Permission For TDP Nara Lokesh Yuva Galam Padayatra | Sakshi
Sakshi News home page

లోకేష్‌ పాదయాత్రకు అనుమతి.. నిబంధనల లోబడే జరగాలి: చిత్తూరు ఎస్పీ ప్రకటన

Jan 23 2023 2:54 PM | Updated on Jan 23 2023 5:06 PM

AP Govt Permission For TDP Nara Lokesh Yuva Galam Padayatra - Sakshi

అనుమతి ఇవ్వకుండా వేధిస్తోందంటూ ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న..

సాక్షి, చిత్తూరు: టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టబోయే యువ గళం పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జిల్లా ఎస్పీ రిషాంత్‌ స్పష్టం చేశారు. సోమవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని నారా లోకేష్‌, టీడీపీ క్యాడర్‌కు సూచించారు.

ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఎస్పీ రిషాంత్‌ సూచించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 27వ తేదీ నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. మరోవైపు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా వేధిస్తోందంటూ యెల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసుకుంటోంది టీడీపీ.

Advertisement
 
Advertisement
Advertisement