ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

AP Govt Issued Directions To Make Changes To Drawing Officer System In Secretariats - Sakshi

ఇకపై గ్రామ సచివాలయాలు, పంచాయతీలకు వేర్వేరుగా డీడీవోలు

సచివాలయాల్లోని డ్రాయింగ్‌ ఆఫీసర్‌ వ్యవస్థలో మార్పులు చేస్తూ ఆదేశాలు

సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలు- పంచాయితీల డీడీఓ బాధ్యతల్ని వికేంద్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో ఇప్పటి వరకు ఉన్న డ్రాయింగ్ ఆఫీసర్ వ్యవస్థలో మార్పులు చేస్తూ ఆదేశాలిచ్చింది.  పంచాయితీ ఉద్యోగులకు  పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారి.. డీడీఓగా వ్యవహరించనున్నారు. గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులందరికీ డీడీఓగా వీఆర్వోకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటి వరకూ మొత్తం డ్రాయింగ్ అండ్ డిస్‌బర్స్‌మెంట్‌ అధికారి బాధ్యతల్ని కూడా పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారులే  నిర్వర్తించారు. కాగా, ఇకపై పంచాయతీలకు, సచివాలయాలకు వేర్వేరుగా డీడీఓలు నియమించింది. పంచాయితీలకు, సచివాలయాలకు లింక్ అధికారిగా గ్రామ పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమిస్తూ ఏపీ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది.
చదవండి:
విద్యారంగం: ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం 
ఏపీ చరిత్రలోనే ఇదో రికార్డు: ఎంపీ విజయసాయిరెడ్డి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top