నైపుణ్య కళాశాలలు: ఏపీ సర్కార్‌ కీలక ముందడుగు..

AP Govt Has Issued Orders For Set Up Of 25 Skill Colleges - Sakshi

ఉపాధి కల్పనే లక్ష్యం లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి 

సాక్షి, అమరావతి: విద్యార్థులు, యువత మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా వారిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఏర్పాటు చేస్తున్న నైపుణ్య కళాశాలల స్థాపనకు కీలక ముందడుగు పడింది. నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు పరిపాలన అనుమతులు ఇస్తూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.

రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రూ.1,385.53 కోట్లతో 30 స్కిల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 25, ట్రిపుల్‌ఐటీల్లో ఒక్కొక్కటి వంతున 4, పులివెందులలో ఒకటి ఏర్పాటు చేయనున్నారు. మొదటగా లోక్‌సభ నియోజకవర్గాల్లో 25 స్కిల్‌ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

చదవండి: 2 Years Of YS Jagan Rule In AP: 86 శాతం ఇళ్లకు లబ్ధి   
వారెప్పటికీ అనాథలు కారు..! 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top